పవన్ కళ్యాణ్ హీరోయిన్ ని వేధించారట
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ని వేధించారట

Murali R | Published:October 21, 2017, 11:42 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన కృతి కర్బందా సంచలన ఆరోపణలు చేసింది , సినిమా రంగంలోకి వచ్చిన తొలినాళ్ళ లో నన్ను కూడా లైంగికంగా కొంతమంది వేధించారని అయితే నేను అలాంటి వాటికీ లొంగలేదని అంటోంది కృతి కర్బందా . తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించింది కృతి కర్బందా . తెలుగులో సుమంత్ , పవన్ కళ్యాణ్ , కళ్యాణ్ రామ్ లతో పాటు చరణ్ సోదరిగా నటించింది . అయితే తెలుగులో ఎన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు దాంతో ఈ భామని పట్టించుకున్న వాళ్ళు లేరు . 

 

 

ఛాన్స్ లు లేకపోవడంతో హిందీ లో కూడా ప్రయత్నాలు బాగానే చేస్తోంది కానీ అదృష్టం మాత్రం దక్కడం లేదు . అయితే సక్సెస్ ల విషయం పక్కన పెడితే సినిమా రంగంలో హీరోయిన్ లను లైంగికంగా వేధించేవాళ్ళు చాలామంది ఉన్నారని , ఆ అనుభవం నాకు కూడా ఎదురయ్యిందని ఆరోపణలు చేస్తోంది . పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ చిత్రంలో నటించింది కృతి కర్బందా . అయితే లైంగికంగా వేధించిన వాళ్ళు ఎవరో మాత్రం చెప్పలేదు .
Comments

FOLLOW
 TOLLYWOOD