మీనాబజార్., గుమ్మడికాయ వేడుక
TOLLYWOOD
 TOPSTORY

మీనాబజార్., గుమ్మడికాయ వేడుక

Murali R | Published:November 18, 2017, 7:28 PM IST
సింగ్  సినిమాస్ పతాకం పై నాగేంద్ర సింగ్ నిర్మాణం లో రానా సునీల్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం www.మీనాబజార్., నలభై ఐదు రోజులుగా బెంగుళూరు, మంగళూరు, చిక్ మంగళూర్ మరియు హైదరాబాద్ వంటి లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొని ఈ రోజు హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. చివరిరోజు కావటం తో యూనిట్ సభ్యులందరు మీడియా సమక్షంలో గుమ్మడికాయ వేడుకను జరుపుకున్నారు.

అనంతరం పాత్రికేయుల సమావేశం లో నృత్య దర్శకురాలు సంజూ మాట్లాడుతూ "ఇలాంటి  మంచి సినిమాలో  నేను ఒక్క భాగం అయినందుకు చాలా సంతోషం గా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సునీల్ సింగ్ గారికి నిర్మాత నాగేంద్ర సింగ్ గారికి కృతఙ్ఞతలు".

సినిమాటోగ్రాఫర్ మధు కె రాజన్ మాట్లాడుతూ "50 రోజులు చాల కష్టపడి పనిచేసాము. ప్రతి టెక్నీషియన్ చాలా  కష్టపడి 50 రోజులపాటు పనిచేసారు. సినిమా చాలా  బాగా వచ్చింది. పరీక్షా వ్రాసాము మార్కుల కోసం ఎదురుచూస్తున్నాము తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది".

హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ "ఈరోజు షూటింగ్ చివరి రోజు. చాలా కష్టపడి పనిచేసాము. నేను ఈ సినిమా లో ఒక్క హీరోయిన్ గా నటిస్తున్నాను, తెలుగు రాకపోయినా దర్శకులు సునీల్ సింగ్ చాల సపోర్ట్ చేసారు. సినిమా రిలీజ్ కోసం ఎదురుచుస్తున్నాము".

హీరో మధుసూదన్ మాట్లాడుతూ "ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా జరిగింది. షూటింగ్ అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. డైరెక్టర్ సునీల్ గారికి చాలా  థాంక్స్ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఈ సినిమా కి కథ హీరో మేము కేవలం నటించాము. దర్శకుడు మరియు నిర్మాత ఎక్కడ రాజి పడకుండా బడ్జెట్ మించి ఖర్చుపెట్టారు. మాకు ఇది కొత్త లైఫ్ లాంటిది. మీడియా సపోర్ట్ కావాలి. సినిమా విజయవంతం అవుతుందని నమ్మకం నాకుంది ".

దర్శకుడు సునీల్ సింగ్ మాట్లాడుతూ "ఈ సినిమా ని తెలుగు కన్నడ భాషలో చిత్రీకరించాం. ఈ సినిమా ఐదు క్యారెక్టర్ చుట్టు తిరుగుతుంది.  స్క్రీన్  ప్లే చాలా  బాగుంటుంది. ఈ సినిమా టైటిల్  www.మీనాబజార్., కి సినిమాలోనే మంచి జస్టిఫికేషన్ ఇచ్చాము . మధు సుధన్ చాలా బాగా చేసాడు. శ్రీజిత చాలా  బాగా నటించింది.  ఫిబ్రవరి లో ఈ సినిమా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము ".Comments

FOLLOW
 TOLLYWOOD