పెళ్ళిచూపులు హీరోతో మెగా డాటర్
TOLLYWOOD
 TOPSTORY

పెళ్ళిచూపులు హీరోతో మెగా డాటర్

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

పెళ్లి చూపులు చిత్రంతో ఇండస్ట్రీ ద్రుష్టి ని ఆకర్షించిన హీరో విజయ్ దేవరకొండ . ఆ చిత్ర ఘనవిజయం తర్వాత విజయ్ కు బోలెడు ఆఫర్లు వస్తున్నాయి ఆ బాటలోనే ఇప్పుడు ఏకంగా మెగా డాటర్ నిహారిక తో రొమాన్స్ చేసే చాన్స్ కొట్టేసాడు . ఇటీవలే జ్యో అచ్యుతానంద చిత్రంతో హిట్ అందుకున్న దర్శకులు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - నిహారిక ల కాంబినేషన్ లో ఓ సినిమా చేసి పెట్టమని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కోరాడట . అవసరాల కూడా ఒప్పుకున్నాడు కానీ ప్రస్తుతం నాని తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . ఆ సినిమా తర్వాత నిహారిక హీరోయిన్ గా సినిమా చేయనున్నాడు అవసరాల . నాగబాబు కూతురు  నిహారిక ఒక మనసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే .
Comments

FOLLOW
 TOLLYWOOD