భారీ ప్రమాదం నుండి బయటపడిన మంత్రి
TOLLYWOOD
 TOPSTORY

భారీ ప్రమాదం నుండి బయటపడిన మంత్రి

Murali R | Published:October 11, 2017, 4:20 PM IST
భారీ ప్రమాదం నుండి బయటపడ్డాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ . ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయానికి శంఖుస్థాపన చేసిన అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో కీసర ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఈ భారీ ప్రమాదం జరిగింది . మంత్రి తలసాని ప్రయాణిస్తున్న కారు ని వెనుకనుండి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టడంతో కారు దెబ్బతింది అయితే ఈ యాక్సిడెంట్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఎటువంటి గాయాలు కాలేదు దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . 
 
 
 
మంత్రి కి దెబ్బలు తగలలేదు కానీ అదే కారులో ప్రయాణిస్తున్న మేడ్చల్ ఎం ఎల్ ఏ సుధీర్ రెడ్డి కి మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి దాంతో ఎం ఎల్ ఏ ని వెంటనే ఆసుపత్రి కి తరలించారు . మంత్రి కారుకి యాక్సిడెంట్ అని తెలియగానే అధికార పక్షం లో ఆందోళన నెలకొంది . మంత్రి కారు ని యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . Comments

FOLLOW
 TOLLYWOOD