మోహన్ బాబు ఇంట విషాదం
TOLLYWOOD
 TOPSTORY

మోహన్ బాబు ఇంట విషాదం

Murali R | Published:October 24, 2017, 5:10 PM IST
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట విషాదం నెలకొంది , మోహన్ బాబు చెల్లెలు భర్త అయిన మేడసాని వెంకటాద్రి నాయుడు గుండెపోటు తో మరణించాడు . దాంతో మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది . మోహన్ బాబు నటించిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన మేడసాని వేంకటాద్రి నాయుడు తిరుపతి లోని శ్రీ విద్యానికేతన్ కి కోశాధికారి గా వ్యవహరిస్తున్నాడు . మోహన్ బాబు కు స్వయానా బావ కావడంతో అతడి మరణం ఆ కుటుంబాన్ని శోక సంద్రం లో ముంచెత్తింది . 
 
 
 
మోహన్ బాబు కోసం నిర్మాతగా మారిన మేడసాని ఆ తర్వాత సినిమాలకు దూరమై మోహన్ బాబు నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ బాధ్యతలు చూస్తున్నాడు . అయితే ఈరోజు సడెన్ గా గుండెపోటు రావడంతో తిరిగి రాని లోకాలకు వెళ్ళాడు .Image result for mohan babu brother in lawComments

FOLLOW
 TOLLYWOOD