బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ రెడీ చేస్తున్నారు
TOLLYWOOD
 TOPSTORY

బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ రెడీ చేస్తున్నారు

Murali R | Published:June 18, 2017, 12:00 AM IST
1987 లో రిలీజ్ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన చిత్రం '' మిస్టర్ ఇండియా ''. అనిల్ కపూర్ ని స్టార్ ని చేసిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది . అనిల్ కపూర్- శ్రీదేవి ల జంట ప్రేక్షకులను విశేషంగా అలరించింది . బ్లాక్ బస్టర్ గా నిలిచిన మిస్టర్ ఇండియా కు ఇన్నాళ్ల తర్వాత సీక్వెల్ చేసే పనిలో పడ్డాడు శ్రీదేవి భర్త , అనిల్ కపూర్ అన్న బోనీ కపూర్ . ఇక ఈ సీక్వెల్ లో కూడా అనిల్ కపూర్ - శ్రీదేవి లు జంటగా కనిపించనున్నారు కాకపోతే వీళ్ళతో పాటు మరో యువ జంట కూడా నటించనుంది .
 
 

ఇప్పటికే స్క్రిప్ట్ ని పక్కాగా రూపొందించినట్లు దర్శకుడి కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది . బ్లాక్ బస్టర్ అయిన మిస్టర్ ఇండియా సీక్వెల్ కూడా అదే రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బోనీ కపూర్ . త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం శ్రీదేవి కూడా ఆత్రుత గా ఎదురు చూస్తుందట . 
Comments

FOLLOW
 TOLLYWOOD