హాస్య నటుడి కోసం పోలీసుల వేట
TOLLYWOOD
 TOPSTORY

హాస్య నటుడి కోసం పోలీసుల వేట

Murali R | Published:October 11, 2017, 4:57 PM IST
తమిళ హాస్య నటుడు , హీరో గా కూడా టర్న్ అయిన సంతానం కోసం తమిళనాడు పోలీసులు వేట ప్రారంభించారు , అతడు కనబడితే ఏ క్షణం లోనైనా అరెస్ట్ చేయడం ఖాయం . ఇంతకీ హాస్య నటుడి కోసం తమిళ పోలీసులు వేట ప్రారంభించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? సంఘటన వివరాలలోకి వెళితే ........ షణ్ముగ సుందరం అనే కాంట్రాక్టర్ తో కలిసి కోవూరు ప్రాంతంలో కల్యాణ మండపం కట్టాలని భావించాడు సంతానం . అందులో తన వాటా సొమ్ము భారీ మొత్తాన్ని ఇచ్చాడు కూడా . 

 

అయితే ఆ తర్వాత మనసు మార్చుకొని షణ్ముగ సుందరం కు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చేయమని కోరాడు సంతానం . అయితే షణ్ముగ సుందరం మొత్తం సొమ్ము ఇవ్వకుండా కొంత కొంత ఇస్తూ భారీ మొత్తాన్ని ఇంకా తన దగ్గరే పెట్టుకోవడంతో సంతానం ఓపిక నశించి అతడి ఆఫీసు కెళ్ళి షణ్ముగ సుందరం తో వివాదానికి దిగాడు . అయితే ఆ వివాదం పెద్దదయి కొట్టుకునే వరకు వెళ్ళింది . ఆ గొడవలో షణ్ముగ సుందరం తరుపున వచ్చిన లాయర్ , బిజెపి నాయకుడు కూడా అయిన ప్రేమానంద్ కు గాయాలు అయ్యాయి . ఇంకేముంది కేసు పోలీసుల వరకు వెళ్లడమే కాకుండా బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో సంతానం పారిపోయాడు . ప్రస్తుతం సంతానం కోసం పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు అరెస్ట్ చేయడానికి .
Comments

FOLLOW
 TOLLYWOOD