నాగార్జున , ఎన్టీఆర్ లు రిజెక్ట్ చేసిన సినిమా
TOLLYWOOD
 TOPSTORY

నాగార్జున , ఎన్టీఆర్ లు రిజెక్ట్ చేసిన సినిమా

Murali R | Published:November 14, 2017, 7:12 PM IST

నాగార్జున , ఎన్టీఆర్ లు రిజెక్ట్ చేస్తే యంగ్ హీరో నితిన్ కి దక్కింది ఆ అవకాశం . ఇంతకీ నాగార్జున , ఎన్టీఆర్ లు ఎందుకు రిజెక్ట్ చేసారు ? ఏంటా కథ ? అన్న విషయం తెలియాలంటే అసలు విషయం లోకి వెళ్లాల్సిందే . శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వేగేశ్న సతీష్ దాని తర్వాత శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ తో ఓ కథ ని రెడీ చేసుకున్నాడు . దాన్ని ముందుగా నాగార్జున కు చెప్పారు అయితే నాగ్ కథ విన్నాడు కానీ డేట్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు దాంతో ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది శ్రీనివాస కళ్యాణం.

అయితే ఎన్టీఆర్ కూడా కథ విన్నాడు కానీ సతీష్ వేగేశ్న మీద పూర్తిస్థాయిలో నమ్మకం లేకపోవడంతో నో చెప్పాడు కట్ చేస్తే నితిన్ దగ్గరకు వెళ్ళింది కథ . ఇంకేముంది వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు నితిన్ . ఇక ఈ సినిమాని నిర్మించేది ఎవరో తెలుసా ....... దిల్ రాజు . నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమానే దిల్ రాజు నిర్మించిన మొదటి చిత్రం అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ నితిన్ తో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం '' శ్రీనివాస కళ్యాణం '' కావడం విశేషం.
Comments

FOLLOW
 TOLLYWOOD