నాగ్ కి ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు
TOLLYWOOD
 TOPSTORY

నాగ్ కి ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు

Murali R | Published:November 14, 2017, 5:35 PM IST

కింగ్ నాగార్జున కు ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు వచ్చిన పరిస్థితి ఏర్పడింది . మొన్న నాగచైతన్య - సమంత ల రిసెప్షన్ ని భారీ ఎత్తున ఏర్పాటు చేసి అందరూ సంతోషంలో ముంచెత్తగా ఆ మరుసటి రోజే అన్నపూర్ణ స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం నెలకొని 2 కోట్ల ఆస్థి బూడిద అయ్యింది . పైగా అక్కినేని చివరి చిత్రం షూటింగ్ చేసుకున్న మనం సెట్ పూర్తిగా కాలి బూడిద కావడంతో కన్నీళ్ల పర్యంతం అయ్యాడు నాగార్జున . నాన్న గారి చివరి చిత్రమైన మనం సెట్ ని ఆయన జ్ఞాపకంగా చూసుకుంటున్న సమయంలో అది కాలి బూడిద అవ్వడంతో ఆనందం , విషాదం నెలకొన్నాయి.

కేవలం 24 గంటల వ్యవధిలో ఈ రెండు సంఘటనలు జరగడంతో అక్కినేని కుటుంబంలో విషాదం నెలకొంది . అయితే ఇంతటి బాధ మనసులో ఉన్నప్పటికీ తదుపరి కార్యక్రమానికి పూనుకుంటున్నాడు నాగార్జున . హలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తున్నామని ఇదొక రకంగా ఒక కంట  కన్నీరు ,ఒక కంట  పన్నీరు లాంటి దని ట్వీట్ చేసాడు నాగార్జున.
Comments

FOLLOW
 TOLLYWOOD