భయపడుతున్న నాగార్జున
TOLLYWOOD
 TOPSTORY

భయపడుతున్న నాగార్జున

Murali R | Published:December 15, 2017, 1:10 PM IST
అక్కినేని నాగార్జున నిన్న మొన్నటి వరకు బాగానే కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ '' హలో '' చిత్రం రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో తెగ టెన్షన్ పడుతున్నాడు . ఎందుకంటే అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది దాంతో కొంత గ్యాప్ తీసుకొని చేసిన సినిమా '' హలో ''. మనం వంటి క్లాసికల్ హిట్ ని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో ఈనెల 22న రిలీజ్ అవుతోంది . అయితే దానికి ఒకరోజు ముందుగానే నాని నటించిన '' ఎం సి ఏ '' చిత్రం రిలీజ్ అవుతోంది . 

 

నాని ఇటీవల కాలంలో నటించిన చిత్రాలన్నీ వరుసగా హిట్ అవుతున్నాయి , పైగా ఎం సి ఏ చిత్రాన్ని నిర్మించింది అగ్ర నిర్మాత దిల్ రాజు కావడం ..... సినిమాపై పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో నాగార్జున కు భయం పట్టుకుందట . సినిమాలు బాగుంటే ఒక్కటి కాదు నాలుగు చిత్రాలు కూడా ఒకేసారి రిలీజ్ అయి హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి . హలో పైన కూడా నాగ్ చాలా నమ్మకంగా ఉన్నాడు కానీ ఎక్కడో చిన్న భయం ఎందుకంటే అఖిల్ కు తప్పనిసరిగా హిట్ ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు నాగార్జున అందుకే చిన్న భయం .
Comments

FOLLOW
 TOLLYWOOD