2 బీర్లు తాగి బిర్యానీ తిని పడుకున్నాడట
TOLLYWOOD
 TOPSTORY

2 బీర్లు తాగి బిర్యానీ తిని పడుకున్నాడట

Murali R | Published:October 17, 2017, 9:51 AM IST
నాగచైతన్య- సమంత ల  పెళ్లి హాయిగా జరిగిపోవడం , ఇటీవలే రిలీజ్ అయిన రాజుగారి గది 2 సక్సెస్ కావడంతో సీనియర్ హీరో కింగ్ నాగార్జున హాయిగా 2 బీర్లు తాగి ఎంచక్కా బిర్యానీ తిని పడుకున్నాడట దాంతో సక్సెస్ మీట్ కు ఆలస్యంగా వచ్చాడు నాగార్జున . అయితే విచిత్రం ఏంటంటే ఈ విషయాన్నీ నాగార్జునే స్వయంగా వెల్లడించడం . ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ ఏడెకరాలలో రాజుగారి గది 2 సక్సెస్ మీట్ పెట్టారు కానీ కింగ్ నాగార్జున ఆలస్యంగా వచ్చాడు.

దాంతో ఆ ఆలస్యానికి కారణం 2 బీర్లు తాగి బిర్యానీ తిని పడుకోవడమే అని చెప్పాడు . సమంత ఆత్మ గా నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్ అందాలు మరో హైలెట్ . ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది 2 చిత్రం మలయాళ చిత్రానికి రీమేక్ కాగా చాలా మార్పులు చేసి నిర్మించారు . మొత్తానికి 3 రోజుల్లో 12 కోట్ల షేర్ రాబట్టింది రాజుగారి గది 2. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ లాభాలను తెస్తోంది.Comments

FOLLOW
 TOLLYWOOD