నాగార్జున వర్మతో సినిమా చేస్తాడా
TOLLYWOOD
 TOPSTORY

నాగార్జున వర్మతో సినిమా చేస్తాడా

Murali R | Published:October 21, 2017, 5:19 PM IST
శివ చిత్రం 26 ఏళ్ల క్రితం రిలీజ్ అయి తెలుగు చలన చిత్ర రంగాన పెను సంచలనం సృష్టించింది . అంతటి సంచలన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాంగోపాల్ వర్మ . అయితే ఆ సినిమా తర్వాత ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే తన ప్రభావం చూపించాడు కట్ చేస్తే ఇప్పుడు వరుసగా ఘోరమైన ప్లాప్ చిత్రాలను తీస్తూ ఉన్న పేరు ని ఎప్పుడో చెడగొట్టుకున్నాడు . తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే వివాదాస్పద చిత్రం చేయనున్నట్లు ప్రకటించి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు . అయితే ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు కానీ ఈలోపు  కింగ్ నాగార్జున తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట వర్మ.

నాగార్జున- వర్మ కాంబినేషన్ లో శివ తో పాటు గోవిందా గోవిందా , అంతం సినిమాలు వచ్చాయి కానీ శివ మాత్రమే సంచలనం సృష్టించింది మిగతా రెండు సినిమాలు అంతగా ఆడలేదు . డిసెంబర్ లో కొత్త సినిమా స్టార్ట్ చేసి వేసవిలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట వర్మ . మరి నాగార్జున ఇందుకు ఒప్పుకుంటాడా ? వర్మ తో సినిమా చేస్తాడా చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD