బాలయ్య కొడుకు ఆ సినిమాలో నటిస్తాడా
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్య కొడుకు ఆ సినిమాలో నటిస్తాడా

Murali R | Published:June 19, 2017, 12:00 AM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే . అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం మరాఠీ లో సంచలన విజయం సాధించి వంద కోట్ల వసూళ్ల ని సాధించిన '' సైరత్ '' చిత్రంలో మోక్షజ్ఞ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి . మరాఠీ చలన చిత్ర చరిత్ర లో సైరత్ అపూర్వ విజయం సాధించింది దాంతో ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టీనేజ్ లవ్ స్టోరీ కావడంతో మోక్షజ్ఞ కు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట . అయితే మోక్షజ్ఞ సైరత్ రీమేక్ లో నటుస్తున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే బాలయ్య స్వయంగా వెల్లడిస్తే తప్ప నమ్మలేం మరి . 2017 తర్వాత మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం చేస్తామని అన్నారు బాలయ్య అంటే సమయం దగ్గర పడుతోంది మిత్రమా !Comments

FOLLOW
 TOLLYWOOD