రూమర్స్ పై స్పందించిన హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

రూమర్స్ పై స్పందించిన హీరోయిన్

Murali R | Published:January 12, 2017, 12:00 AM IST
ఇక పై సినిమాల్లో నటించాలనే ఆసక్తి హీరోయిన్ నందితా రాజ్ కు లేదని వార్తలు గుప్పుమనడం తో అవి తన కెరీర్ కే ప్రమాదం కనుక వెంటనే స్పందించింది నందితా రాజ్ . నాకు సినిమాలంటే అమితమైన ఆసక్తి , నేను సినిమాల పట్ల విముఖంగా ఉన్నానన్న వార్తలు నిరాధారం దయచేసి వాటిని నమ్మకండి అంటూ ట్వీట్ చేసింది నందితా రాజ్ . నీకు నాకు డాష్ డాష్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నందితా కు తెలుగులో వరుసగా సినిమాలు వచ్చాయి .
 
 

వాటిలో ప్రేమకథా చిత్రం , బస్ స్టాప్ ,లవర్స్  చిత్రాలు హిట్ కాగా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని నటిగా నందితా రాజ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది . ఆ సినిమా తర్వాత చేసిన శంఖారాభరణం , సావిత్రి చిత్రాలు ప్లాప్ అయ్యాయి దాంతో పాపం ఈ భామ మరుగున పడిపోయింది అవకాశాలు సన్నగిల్లాయి . ఇంకేముంది నందితా రాజ్ ఇక సినిమాల్లో నటించదు అంటూ గాలివార్తలు రావడంతో వాటిని ఖండిస్తోంది నందితా రాజ్ . 
Comments

FOLLOW
 TOLLYWOOD