నాని సినిమాకు విచిత్రమైన టైటిల్
TOLLYWOOD
 TOPSTORY

నాని సినిమాకు విచిత్రమైన టైటిల్

Murali R | Published:October 19, 2017, 9:00 PM IST
వరుస విజయాలు సాధిస్తున్న నాని తాజాగా ఎం సి ఏ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే , దాంతో పాటు కృష్ణార్జున యుద్ధం అనే సినిమా కూడా చేస్తున్నాడు . అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు నాని . శేఖర్ కమ్ముల సినిమా మాత్రమే కాకుండా నేను శైలజ వంటి బ్లాక్ బస్టర్ కు దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు , మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనున్న ఆ చిత్రానికి విచిత్రమైన టైటిల్ ని రిజిస్టర్ చేయించారు మైత్రి మూవీస్ వాళ్ళు . 
 
 
ఇంతకీ వాళ్ళు రిజిస్టర్ చేయించిన టైటిల్ ఏంటో తెలుసా ....... ..... చిత్రలహరి . అవును'' చిత్రలహరి ''అనే టైటిల్ ని అనుకుంటున్నారట . అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . అప్పట్లో దూరదర్శన్ లో చిత్రలహరి అనే పాటల కార్యక్రమం వచ్చేది . ఆ కార్యక్రమం కోసం వేయి కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు 80 వ దశకంలో . తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది .Comments

FOLLOW
 TOLLYWOOD