నాని ఎం సి ఏ సెన్సార్ టాక్
TOLLYWOOD
 TOPSTORY

నాని ఎం సి ఏ సెన్సార్ టాక్

Murali R | Published:December 16, 2017, 4:39 AM IST
నాని - ఫిదా భామ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం '' ఎం సి ఏ ( మిడిల్ క్లాస్ అబ్బాయి ) . వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 21న భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధమైంది . నిన్న నే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది , యు / ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా పై పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి . సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ఎం సి ఏ చిత్ర బృందాన్ని అభినందించారట . వరంగల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంతో నాని మరో హిట్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . 

 

సెన్సార్ సభ్యుల అభినందనలతో పాటుగా ట్రైలర్ కు విపరీతమైన అప్లాజ్ రావడంతో డ్యామ్ శ్యుర్ హిట్ అని ధీమాగా ఉన్నారు . నాని ,సాయి పల్లవి జంట ప్రేక్షకులకు మంచి కనువిందు అని , అలాగే భూమిక పాత్ర కూడా హైలెట్ గా ఉంటుందని లవ్ ఎంటర్ టైన్మెంట్ కు తోడు యాక్షన్ కూడా ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తోంది . మొత్తానికి టాక్ ప్రకారం నాని కి మరో హిట్ దొరికినట్లే . 
Comments

FOLLOW
 TOLLYWOOD