నాని భలే లక్కీ
TOLLYWOOD
 TOPSTORY

నాని భలే లక్కీ

Murali R | Published:December 17, 2017, 4:22 AM IST

నాని గత రెండేళ్లుగా వరుసగా విజయాలు సాధిస్తూ సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో సంచలనం సృష్టించిన నాని తాజాగా ట్రిపుల్ హ్యాట్రిక్ పై కన్నేశాడు. ఈనెల 21న ఎం సి ఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి ) చిత్రం రిలీజ్ అవుతోంది. ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించాడు.

 

 

సెన్సార్ టాక్ కూడా బాగుండటంతో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది తప్పకుండా సినిమా హిట్ అవుతుందని. ఇక తాజాగా కొత్త సినిమాని అంగీకరించాడు నాని . సీనియర్ హీరో నాగార్జున తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రం లో నటించనున్నాడు నాని. నాగార్జున , నాని ల కాంబినేషన్ అంటే ఆ సినిమాకు క్రేజ్ రావడం ఖాయం . ఫిబ్రవరి నుండి ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే పలు హిట్ లతో మంచి జోరు మీదున్న నాని నాగ్ తో మల్టీస్టారర్ చేస్తూ భలే లక్కీ అయిపోయాడు.
Comments

FOLLOW
 TOLLYWOOD