లాభాలబాటలోకి నాని నిన్ను కోరి
TOLLYWOOD
 TOPSTORY

లాభాలబాటలోకి నాని నిన్ను కోరి

Murali R | Published:July 15, 2017, 12:00 AM IST
వారం రోజుల్లోనే నాని నటించిన నిన్ను కోరి చిత్రం లాభాలబాటలోకి వెళ్ళింది . రెండు తెలుగు రాష్ట్రాలలోనే 15 కోట్ల షేర్ వచ్చేసింది దాంతో ఇక్కడే లాభాలు వచ్చేసాయి , ఇక ఓవర్ సీస్ అదనం , అక్కడ కూడా మంచి లాభాలు వస్తున్నాయి . ఈ సినిమాని కొన్న బయ్యర్లకు లాభాల పంట పండుతోంది . నాని నటించిన చిత్రాలు ఇప్పటికే ఆరు సినిమాలు వరుసగా హిట్ కాగా నిన్ను కోరి చిత్రంతో ట్రిపుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాడు.

ఇక ఓవర్ సీస్ లో అయితే అగ్ర హీరోలకు కూడా వీలుకాని అరుదైన ఫీట్ ని అందుకున్నాడు నాని . వరుసగా నాలుగు చిత్రాలు వన్ మిలియన్ దాటిన చిత్రాలు ఉన్న హీరోగా గుర్తింపు పొందాడు నాని . కొత్త దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నివేదా థామస్ , ఆది పినిశెట్టి లు నటించారు.Comments

FOLLOW
 TOLLYWOOD