నాని రిజెక్ట్ చేసిన సినిమానట ఇది
TOLLYWOOD
 TOPSTORY

నాని రిజెక్ట్ చేసిన సినిమానట ఇది

Murali R | Published:February 17, 2017, 12:00 AM IST
వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని . అయితే గత ఏడాది సీనియర్ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో నటించే గొప్ప అవకాశం లభించడం తో సంతోషంగా ఒప్పుకున్నాడు . అయితే ఆ సినిమా నుండి నాని అర్దాంతరంగా తప్పుకున్నాడు హీరో స్థానం లో తమిళ స్టార్ హీరో కార్తీ వచ్చాడు దాంతో చాలామంది షాక్ అయ్యారు . కట్ చేస్తే ఇప్పుడు అసలు విషయం తెలిసింది. 
 
 

ఇంతకీ నాని చెలియా సినిమా నుండి తప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా.... కథ , కథనం నచ్చక పోవడమే . మణిరత్నం దర్శకత్వంలో నటించాలని నాని బాగా ఉత్సుకత తో ఉన్నప్పటికీ నాని కి వరుసగా సినిమాలు ఉండటం ఒక కారణమైతే , నాని ఊహించిన రేంజ్ లో కథ లేకపోవడం మరో కారణమట . మరి నాని రిజెక్ట్ చేసిన చెలియా హిట్ అవుతుందా? లేదా ? చూడాలి. 
Comments

FOLLOW
 TOLLYWOOD