నవంబ‌ర్ 24న `నెపోలియ‌న్‌` సంద‌డి
TOLLYWOOD
 TOPSTORY

నవంబ‌ర్ 24న `నెపోలియ‌న్‌` సంద‌డి

Murali R | Published:November 22, 2017, 6:43 PM IST
ఆచార్య క్రియేషన్స్‌, ఆనంద్‌ రవి కాన్సెప్ట్‌ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం 'నెపోలియన్‌'. ఆనంద్‌ రవి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోమ‌లి, ర‌వివ‌ర్మ‌, కేదార్ శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, గురురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మాత. ఈ సినిమా న‌వంబ‌ర్ 24న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుద‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగిన స‌మావేశంలో..
 

ఆనంద్ ర‌వి మాట్లాడుతూ - ``ఈ వారం రిలీజ్ అవుతున్న చిత్రాల్లో మా నెపోలియ‌న్ చిత్రానికే మంచి క్రేజ్ ఉంటుంది. మంచి టీం క‌లిసి చేసిన క‌ష్ట‌మిది. చిన్న సినిమాగా మొద‌లై పెద్ద రేంజ్‌లో నిల‌బ‌డింది. నీడ‌పోయింద‌ని రిపోర్ట్ ఇచ్చే కామ‌న్ మ్యాన్ క‌థే ఈ చిత్రం.  ఆడియెన్స్‌ను ఎగ్జ‌యిట్‌మెంట్‌కు గురిచేసే చిత్రం. న‌వంబ‌ర్ 24న విడుల‌వుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. గీతాఆర్ట్స్ బ‌న్నీ వాసుగారు మాకు విడుద‌ల స‌మ‌యంలో స‌హ‌కారం అంద‌స్తున్నందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌`` అన్నారు.

 

భోగేంద్ర గుప్త మాట్లాడుతూ - ``కొత్త కాన్సెప్ట్‌తో చేసిన చిత్ర‌మిది. కొత్త టీంతో బాగా క‌ష్ట‌ప‌డ్డారు. అవుట్‌పుట్ బాగా వ‌చ్చింది. గీతాఆర్ట్స్‌వారు సినిమా రిలీజ్‌కు స‌పోర్ట్ చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. సినిమా యు.ఎస్‌., యు.కెలో కూడా విడుద‌ల‌వుతుంది. సినిమాను ప్రేక్ష‌కులు పెద్ద హిట్ చేయించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

 

కోమ‌లి మాట్లాడుతూ - ``సినిమాపై ఆస‌క్తితో డాక్ట‌ర్ ప్రాక్టీస్ కూడా మానేశాను. ఒకప్పుడు నాకు న‌చ్చిన సినిమాలే చూసేదాన్ని. కానీ నెపోలియ‌న్ నా అభిప్రాయాన్ని మార్చేసింది. ప్ర‌తి సినిమాకు ప‌డే క‌ష్టం అర్థ‌మైంది. సినిమా డిఫ‌రెంట్‌గా ఉండి ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది`` అన్నారు. 

 
 
ర‌వివ‌ర్మ మాట్లాడుతూ - ``నాకెరీర్‌లో నిలిచిపోయే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఎమోష‌న‌ల్ ఫ్లో ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ మూవీ`` అన్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ స‌దాశివుని, సినిమాటోగ్రాఫ‌ర్ మార్గ‌ల్ డేవిడ్ త‌దిత‌రులు పాల్గొని సినిమాను ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరారు. 




Comments

FOLLOW
 TOLLYWOOD