అర్జున్ రెడ్డి కి హీరోయిన్ కావాలట
TOLLYWOOD
 TOPSTORY

అర్జున్ రెడ్డి కి హీరోయిన్ కావాలట

Murali R | Published:November 13, 2017, 10:07 AM IST
తెలుగునాట సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది . తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ రీమేక్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు . యూత్ ని అట్రాక్ట్ చేసే సినిమా కావడంతో విక్రమ్ ముచ్చటపడి మరీ ఈ సినిమా హక్కులు తీసుకొని తన వారసుడి ని హీరోగా పరిచయం చేస్తున్నాడు . అయితే తెలుగులో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు కానీ ధృవ్ కొత్త హీరో కాబట్టి హీరోయిన్ గా కొత్త అమ్మాయినే పరిచయం చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యాడట విక్రమ్ అందుకే కాస్టింగ్ కాల్ కి పిలుపు నిచ్చాడు విక్రమ్ . 
 
 
 
హెబ్బా పటేల్ ని కూడా అనుకున్నారు కానీ కొత్త అమ్మాయి కోసమే విక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నారు . తెలుగులో సూపర్ హిట్ అయినట్లుగానే తమిళంలో కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు విక్రమ్ అండ్ కో . కొత్త హీరోయిన్ దొరికితే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . మరి ఆ కొత్త భామ ఎవరో చూడాలి .Comments

FOLLOW
 TOLLYWOOD