నిహారిక కొత్త సినిమా మొదలయ్యింది
TOLLYWOOD
 TOPSTORY

నిహారిక కొత్త సినిమా మొదలయ్యింది

Murali R | Published:June 16, 2017, 12:00 AM IST
మెగా డాటర్ నిహారిక కొత్త సినిమా మొదలయ్యింది . ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నిహారిక ఆ సినిమాతో ఘోర పరాజయాన్ని అందుకుంది . ఆ సినిమా ఇచ్చిన షాక్ తో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నిహారిక ఎట్టకేలకు మరో సినిమాకు పచ్చజెండా ఊపింది . కొత్త దర్శకుడు రవి దుర్గా ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో ఒప్పేసుకుంది నిహారిక . దాంతో ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ దైవసన్నిధానం లో సినిమా ప్రారంభమైంది.

నిహారిక కు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి పోవాలని ఆశగా ఉంది , అందుకే ఒక మనసు చిత్రం ఘోర పరాజయం పొందినప్పటికీ మళ్ళీ ప్రయత్నం చేస్తోంది . మరి ఈ సినిమాతో హిట్ కొడుతుందో లేక మళ్ళీ ప్లాప్ అందుకుంటుందో చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD