రెమ్యునరేషన్ పెంచిన నిఖిల్
TOLLYWOOD
 TOPSTORY

రెమ్యునరేషన్ పెంచిన నిఖిల్

Murali R | Published:May 19, 2017, 12:00 AM IST
నిన్న మొన్నటి వరకు 2 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకునే నిఖిల్ తాజాగా రేటు పెంచేసాడు . ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు పెంచి ఒక్కో సినిమాకు 3 కోట్లు రెమ్యునరేషన్ పెంచాడు . నిఖిల్ సినిమాలు విజయాలు సాధిస్తూ లాభాలు కూడా తెస్తుండటంతో ఆ మొత్తం ఇవ్వడానికి వెనుకాడటం లేదు నిర్మాతలు . విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ లు సాధిస్తున్నాడు నిఖిల్ .
 
 

తాజాగా నిఖిల్ నటించిన కేశవ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది . రిలీజ్ కి ముందు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది . ఇక ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే . కేశవ సినిమా తర్వాత రెండు రీమేక్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు నిఖిల్ . ఆ చిత్రాలకు మూడు కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు నిఖిల్ .
Comments

FOLLOW
 TOLLYWOOD