హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన భామ
TOLLYWOOD
 TOPSTORY

హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన భామ

Murali R | Published:September 29, 2017, 4:20 AM IST
మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసి సంతోషంగా ఉంది. తెలుగులో ఈ భామ నాని సరసన జెంటిల్ మన్ చిత్రంలో నటించింది. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది అలాగే ఈ భామకు నటిగా గుర్తింపు నిచ్చింది , దాని తర్వాత మళ్ళీ నాని సరసనే నిన్ను కోరి చిత్రంలో నటించింది.

ఆ సినిమా కూడా హిట్ ఇక ఇప్పుడేమో స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన జై లవకుశ చిత్రంలో నటించింది. మొన్న రిలీజ్ అయిన జై లవకుశ మంచి వసూళ్ల ని సాధిస్తోంది. జై లవకుశ చిత్రానికి హిట్ టాక్ రావడంతో చాలా సంతోషంగా ఉంది నివేదా థామస్ . వరుసగా తెలుగులో చేసిన మూడు చిత్రాలు కూడా హిట్ అయి హ్యాట్రిక్ విజయాన్ని అందించడంతో నివేదా ఉబ్బితబ్బిబ్బైపోతోంది. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది నివేదా థామస్ . Comments

FOLLOW
 TOLLYWOOD