డ్రగ్స్ కేసులో సినీ స్టార్ లకు ఇబ్బందులు లేవు
TOLLYWOOD
 TOPSTORY

డ్రగ్స్ కేసులో సినీ స్టార్ లకు ఇబ్బందులు లేవు

Murali R | Published:August 13, 2017, 12:00 AM IST

ఇకపై డ్రగ్స్ కేసులో రెండో జాబితా ఉండదని అలాగే సినిమా వాళ్ళని మళ్ళీ విచారణకు పిలవమని అకున్ సబర్వాల్ చెప్పడంతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది . గత నెలలో డ్రగ్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఇక డ్రగ్స్ కేసులో ఏదో జరుగబోతోంది , అరెస్ట్ లు తప్పవు అంటూ నానా హంగామా చేసారు అధికారులు కూడా కానీ ఏమైంది చల్లబడిపోయింది .

 

డ్రగ్స్ కేసులో పీకల్లోతు కష్టాల్లో పడిపోయామని భయపడిపోయిన సినిమా వాళ్లంతా ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు . డ్రగ్స్ కేసులో సినిమా వాళ్ళ అరెస్ట్ లు ఉండవని తేల్చి చెప్పడంతో అందరూ ప్రశాంతంగా నిద్ర పోతున్నారు . మొత్తానికి ఈ కేసు కూడా మిగతా కేసు లాగే సంచలనం సృష్టించి వార్తలకు మాత్రమే పరిమితం అయ్యింది . 
Comments

FOLLOW
 TOLLYWOOD