రాజా ది గ్రేట్ లో ఏ హీరో నటించాలో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

రాజా ది గ్రేట్ లో ఏ హీరో నటించాలో తెలుసా

Murali R | Published:October 18, 2017, 5:04 PM IST
రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఈరోజు రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది , దాంతో ఓ సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకున్నారు ఇద్దరు స్టార్ హీరోలు . సూపర్ హిట్ ని మిస్ చేసుకున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా ........ ఒకరు రామ్ కాగా మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ .  హీరో రామ్ అనిల్ చెప్పిన కథ విని ఇంప్రెస్ అయ్యాడు , నటించడానికి రెడీ అయ్యాడు కూడా కానీ హైపర్ ప్లాప్ అవడంతో కావచ్చు లేదంటే సినిమా సరిగ్గా ఆడుతుందో లేదో అన్న అనుమానం కావచ్చు లేదంటే అంధుడి గా నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అన్న అనుమానం కావచ్చు మొత్తానికి అనిల్ కు నో చెప్పాడు దాంతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళాడు . 
 
 
ఎన్టీఆర్ కూడా అనిల్ చెప్పిన కథ విన్నాడు కానీ రిస్క్ ఎందుకని వెంటనే నో చెప్పేసాడు .  కట్ చేస్తే రవితేజ దగ్గరకు మళ్ళీ వెళ్ళింది ఈ రాజా ది గ్రేట్ . ఇక చేసేది లేక రవితేజ ఒప్పుకున్నాడు , ఇప్పుడేమో సక్సెస్ కొట్టాడు ఈ చిత్రంతో . ఈరోజు రిలీజ్ అయిన రాజా ది గ్రేట్ చిత్రానికి ప్రేక్షకాదరణ లభించింది . దాంతో ఎన్టీఆర్ , రామ్ లు ఓ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకున్నట్లైంది . Comments

FOLLOW
 TOLLYWOOD