ఆ వేడుకకు ఎన్టీఆర్ వస్తాడా
TOLLYWOOD
 TOPSTORY

ఆ వేడుకకు ఎన్టీఆర్ వస్తాడా

Murali R | Published:December 15, 2017, 1:25 PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అజ్ఞాత వాసి ఆడియో వేడుకకు ముఖ్య అతిథి గా పిలుస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి , ఈ వార్తలు రావడానికి కారణం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా వచ్చి క్లాప్ కొట్టడమే ! దానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న అజ్ఞాత వాసి చిత్రానికి , ఎన్టీఆర్ తో నిర్మించబోయే చిత్రానికి నిర్మాత రాధాకృష్ణ కావడమే . కామన్ విషయం ఏటంటే ఈ ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలకు దర్శకుడు త్రివిక్రమ్ కావడం . 

 

ఎన్టీఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు అయినప్పటికీ అజ్ఞాత వాసి ఆడియో వేడుకకు ముఖ్య అతిథి గా వస్తాడని ప్రచారం సాగుతోంది . ఒకవేళ ఎన్టీఆర్ కనుక పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో వేడుకకు గెస్ట్ గా హాజరైతే అభిమానుల ఆనందానికి అంతే ఉండదు . ఇద్దరు స్టార్ హీరోలు అందునా మాస్ ని విశేషంగా అలరించే హీరోలు ఒకే వేదిక మీద కనిపిస్తే బ్రహ్మాండమే కదా ! 
Comments

FOLLOW
 TOLLYWOOD