రివ్యూ రైటర్ల పై సెటైర్ వేసిన ఎన్టీఆర్
TOLLYWOOD
 TOPSTORY

రివ్యూ రైటర్ల పై సెటైర్ వేసిన ఎన్టీఆర్

Murali R | Published:September 29, 2017, 5:36 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రివ్యూ రైటర్ల పై సెటైర్ వేసి సంచలనం సృష్టించాడు . నిన్న జై లవకుశ జయోత్సవ వేడుక హైదరాబాద్ లో జరిగింది . ఈ వేడుకలో జై లవకుశ చిత్ర యూనిట్ పాల్గొనగా ఎన్టీఆర్ మాత్రం కొంతమంది రివ్యూ రైటర్ లపై అసహనం వెళ్లగక్కి తనలోని ఆవేదన ని ఆగ్రహాన్ని బహిర్గతం చేసాడు . ఎన్టీఆర్ కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటంటే ........ సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం సినిమా పోయిందని కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసాడు .

మా సినిమాని చూసి బాగుందా ? లేదా ? అని చెప్పాల్సింది ప్రేక్షక  అంతేకాని విశ్లేషకులు కాదు అంటూ ఘాటుగానే వ్యాఖ్యానించాడు . అయితే ఎన్టీఆర్ లో ఇంతటి ఆవేశం పెల్లు బికడానికి కారణం కూడా ఉంది . నిజంగా సినిమా బాగోలేకపోతే డిజాస్టర్ అని చెప్పడంలో తప్పులేదు కానీ హిట్ టాక్ వచ్చిన సినిమాకు కూడా కొంతమంది కావాలని ప్లాప్ టాక్ ని ప్రచారం చేస్తున్నారు  విశ్లేషకులు . అలాగే యాంటీ ఫ్యాన్స్ ఎలాగూ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటారు , వాళ్లకు వ్యతిరేక హీరో సినిమా రావడమే ఆలస్యం దాని గురించి రకరకాల పోస్ట్ లను సోషల్ మీడియాలో పెట్టడం ఆనందం పొందడం చేస్తున్నారు . ఒక పెద్ద  సినిమా మీద కనీసం 200 కుటుంబాల నుండి 300 కుటుంబాల వరకు జీవనోపాధి దొరుకుతుంది . వందలాది మంది కడుపునిండా అన్నం తింటున్నారంటే దానికి కారణం నిర్మాత . ఆ నిర్మాత బాగుంటే ........ అతడికి హిట్స్ వస్తే మరిన్ని సినిమాలు తీస్తాడు అలాగే మరో పదిమంది నిర్మాతలు చిత్ర పరిశ్రమలో అడుగుపెడతారు కానీ సినిమాలు ప్లాప్ కావడం వల్ల నిర్మాత అప్పుల పాలు అవుతాడు లేదంటే రోడ్డున పడతాడు కాబట్టి మాగ్జిమమ్ సినిమాలు హిట్ కావాలి పది మందికి ఉపాధి దొరకాలి అప్పుడే చిత్ర పరిశ్రమ కళకళలాడుతుంది . అందుకే ఎన్టీఆర్ కొంతమంది పైసెటైర్ వేసినప్పటికీ అందులో వాస్తవం ఉంది . Comments

FOLLOW
 TOLLYWOOD