3 రోజుల్లో 75కోట్లు రాబట్టిన ఎన్టీఆర్
TOLLYWOOD
 TOPSTORY

3 రోజుల్లో 75కోట్లు రాబట్టిన ఎన్టీఆర్

Murali R | Published:September 29, 2017, 4:42 AM IST
మూడు రోజుల్లో 75 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్ . జై లవకుశ ఈనెల 21న భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే . మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 49 కోట్ల వరకు రాబట్టి రెండో రోజు నుండి కాస్త మందగించింది దాంతో మూడు రోజుల్లో 75కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . మహేష్ సినిమా రావడానికి మరో రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ మూడు రోజుల పాటు అంటే మొత్తంగా ఆరు రోజుల్లో ఎంత లాక్కొస్తే అంత మంచిదనే ఉద్దేశ్యం తో ఆ చిత్ర బృందం ఉన్నారు .

వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగానే మూడు రోజుల వసూళ్లు వచ్చాయి అయితే ఇది షేర్ కాదు గ్రాస్ మాత్రమే . ఇందులో జి ఎస్ టి రూపంలో పెద్ద మొత్తమే పోతుంది . బయ్యర్లు ఒడ్డున పడాలంటే 95 కోట్ల షేర్ రాబట్టాలి . ఈరోజు ఆదివారం కాబట్టి ఆపై కూడా సెలవులు ఉన్నందున మొదటి వారంలో ఎంత వసూల్ చేస్తే అంత విజయం . ఈ సినిమా బయ్యర్లంతా లాభాల్లో తేలియాడాలంటే జై లవకుశ 160 కోట్ల వసూళ్ల ని సాధించాలి .Comments

FOLLOW
 TOLLYWOOD