ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ బాగుంది
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ బాగుంది

Murali R | Published:May 19, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా '' జై లవకుశ '' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ లుక్ ని రిలీజ్ చేసారు . ఓకే గెటప్ కి సంబంధించి రెండు స్టిల్స్ లను వదిలారు ఆ చిత్ర బృందం . అయితే ఆ రెండు స్టిల్స్ లో కూడా ఎన్టీఆర్ రఫ్ లుక్ లో ఉన్నాడు పైగా నెగెటివ్ షేడ్ అన్న మాట ప్రకారం యాంటీ రోల్ లాగే కనిపిస్తోంది పైగా ఎన్టీఆర్ వెనకాల రావణాసురుడి గెటప్ కూడా ఉండటంతో అది రుజువు అవుతోంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే . అందులో రెండు పాత్రలు ఎలా ఉండనున్నాయోమో కానీ ఈ పాత్ర మాత్రం నెగెటివ్ పాత్ర అని తేలిపోయింది . బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD