ఎన్టీఆర్ విక్రమ్ కాంబినేషన్ లో సినిమా
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ విక్రమ్ కాంబినేషన్ లో సినిమా

Murali R | Published:October 21, 2017, 9:05 PM IST
మనం వంటి క్లాసికల్ హిట్ చిత్రాన్ని 24 వంటి విభిన్న తరహా చిత్రాన్ని అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం విక్రమ్ అఖిల్ హీరోగా నటిస్తున్న '' హలో '' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . కాగా ఆ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు . అయితే ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ ని రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ - విక్రమ్ ల కాంబినేషన్ లో సినిమా అంటే 24 చిత్రంలా విభిన్న తరహాగా ఉంటుందా ? మనం లాగా క్లాసికల్ టచ్ ఇస్తాడా చూడాలి.

ఇటీవలే జై లవకుశ చిత్రంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన సమయాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తున్నాడు . త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కూడా , పవన్ కళ్యాణ్ తో సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుంది . దాని తర్వాత విక్రమ్ సినిమా ఉండొచ్చు.



Comments

FOLLOW
 TOLLYWOOD