ఎన్టీఆర్ గిఫ్ట్ అదిరింది
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ గిఫ్ట్ అదిరింది

Murali R | Published:September 6, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ అదిరింది . ఎన్టీఆర్ ఏంటి ? తన అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా జై లవకుశ పాటలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి కాగా తాజాగా లిరికల్ వీడియో ని కూడా రిలీజ్ చేసారు . లిరిక్స్ తో పాటు మధ్య మధ్యలో ఎన్టీఆర్ రాశి ఖన్నా పిక్స్ తో వచ్చిన '' ట్రింగ్ ట్రింగ్ '' సాంగ్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సంగీతాభిమానులను కూడా విశేషంగా అలరిస్తోంది.

పూర్తిస్థాయి పాట కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు . ఇప్పటికే జై లవకుశ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈనెల 10న నందమూరి అభిమానులను ప్రత్యేకంగా కలవడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు దాని తర్వాత సెప్టెంబర్ 21న జై లవకుశ చిత్రం రిలీజ్ కానుంది . సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం . బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించగా నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Related Links

Possitive Reports on NTRs Jai LavaKusa
Copy controversy on ntrs Jai Lavakusa
Huge profits for NTR Jai LavakusaComments

FOLLOW
 TOLLYWOOD