ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా

Murali R | Published:October 18, 2017, 11:03 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు . పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్ తో జాయిన్ కానున్నాడు త్రివిక్రమ్ . మిలిటరీ ఆఫీసర్ కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది , కాగా ఈ సినిమా కోసం అప్పుడే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా కోసం వినబడుతున్న టైటిల్ ఏంటో తెలుసా ........ ...'' సోల్జర్ '' . అవును సోల్జర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

అయితే ఆ టైటిల్ అనుకున్నారేమో కానీ దాన్ని మాత్రం రిజిస్టర్ చేయించలేదు ఇంకా . ఇటీవలే జై లవకుశ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్ . జనతా గ్యారేజ్ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా మొదటి స్థానంలో నిలవగా , జై లవకుశ చిత్రం సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది . అయితే బయ్యర్లు మాత్రం లాభాల్లోకి రాలేదు . భారీ రేటు కి కొనడం వల్ల పెద్దగా లాభాలు రాలేదు బయ్యర్లకు.Comments

FOLLOW
 TOLLYWOOD