నాని తో మళ్ళీ సినిమా చేయనున్న హను
TOLLYWOOD
 TOPSTORY

నాని తో మళ్ళీ సినిమా చేయనున్న హను

Murali R | Published:August 9, 2017, 12:00 AM IST
హను రాఘవపూడి - నాని కాంబినేషన్ లో వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ హిట్ అయిన విషయం తెలిసిందే . ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది . నాని కి కథ కూడా చెప్పాడట హను రాఘవపూడి . లడక్ నేపథ్యంలో సాగే కథ కాబట్టి వచ్చే ఏడాది జూన్ తర్వాత ఆ సినిమా తెరకెక్కనుంది . విభిన్న కథాంశాలతో సినిమాలు రూపొందించడం హను స్టయిల్ అలాగే నాని కూడా విభిన్న కథా చిత్రాలు చేస్తూ రేసులో దూసుకు పోతున్నాడు .
 
 

ప్రస్తుతం నాని ఎం సి ఏ ( మిడిల్ క్లాస్ అబ్బాయి ) చిత్రం చేస్తున్నాడు , ఆ సినిమా ఈ సంవత్సరం లోనే రిలీజ్ కానుంది . ఇక హను రాఘవపూడి విషయానికి వస్తే నితిన్ , అర్జున్ లతో లై అనే సినిమా చేసాడు . అది ఈనెల 11న రిలీజ్ కానుంది .
Comments

FOLLOW
 TOLLYWOOD