హీరోగా చిరు చిన్నల్లుడు కూడా
TOLLYWOOD
 TOPSTORY

హీరోగా చిరు చిన్నల్లుడు కూడా

Murali R | Published:September 5, 2017, 12:00 AM IST
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి చాలామంది హీరోలు ఉన్నారు కాగా ఇప్పుడు మరొక హీరో ఆ ఇంటి నుండి రానున్నాడు . ప్రస్తుతం తన మేకోవర్ పై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఆ హీరో . ఇంతకీ చిరంజీవి ఇంటి నుండి వస్తున్న హీరో ఎవరో తెలుసా ....... ఇంకెవరు చిరు చిన్నల్లుడు కళ్యాణ్ . శ్రీజ ని వివాహం చేసుకున్న కళ్యాణ్ కు సినిమాలంటే ఆసక్తి దాంతో హీరోగా నటిస్తానని చిరు తో చెప్పఁడం చిరు కూడా వెంటనే ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి.

ఇంకేముంది మెగా మావయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నటనలో అలాగే డ్యాన్స్ లో ఫిట్ నెస్ లో శిక్షణ పొందుతున్నాడు కళ్యాణ్ . తాజాగా కళ్యాణ్ తీయించుకున్న కొన్ని ఫోటోలు లీక్ కావడంతో మెగా ఫ్యాన్స్ కూడా సంతోషంగానే ఉన్నారు . కళ్యాణ్ ఫీచర్స్ బాగానే ఉన్నాయి , ఇక స్క్రీన్ పై ఎలా ఉంటాయో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే . మరి ఈ మెగా అల్లుడు మెగా ఫ్యాన్స్ ని అలరిస్తాడా ? లేదా ? చూడాలి .Comments

FOLLOW
 TOLLYWOOD