భారీ నష్టాలను మిగిల్చిన పైసా వసూల్
TOLLYWOOD
 TOPSTORY

భారీ నష్టాలను మిగిల్చిన పైసా వసూల్

Murali R | Published:September 7, 2017, 12:00 AM IST
పైసా వసూల్ 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది . బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది దాంతో నిర్మాత రిలీజ్ కి ముందే హ్యాపీ . కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యింది మార్నింగ్ షో కే డిజాస్టర్ టాక్ వచ్చింది అయినప్పటికీ బాలయ్య కు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓ మోస్తారు వసూళ్లు వచ్చాయి దాంతో నిర్మాత తో పాటు బయ్యర్లు మొత్తం పోగొట్టుకోకుండా బయట పడ్డారు , అయితే భారీ నష్టాలు మాత్రం తప్పడం లేదు మరి.

బయ్యర్లు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుండటం తో నిర్మాతపై వత్తిడి చేస్తున్నారట మాకు కొంత తిరిగి ఇవ్వాల్సిందే అని దాంతో చేసేది లేక సర్దుబాటు చేస్తానని చెప్పాడట . పైసా వసూల్ సినిమా వల్ల పైసలు రాకపోగా పేరు పోయింది అంతేనా పైసా వసూల్ సినిమా పేరు వల్ల ఏకంగా 15 కోట్లకు పైగా నష్టం వస్తోంది పాపం నిర్మాతకు . బాలయ్య తో సినిమా చేసి నాలుగు రాళ్ళూ వెనకేసుకుందాం అని అనుకున్నాడు భవ్య ఆనంద్ ప్రసాద్ కానీ వెనకాల వేసుకున్న నాలుగు రాళ్లు పోయేలా ఉన్నాయి.

Related Links

Paisa Vasool first day Collections
SS Rajamouli liked Balakrishnas look in Paisa Vasool
Balakrishna & Charmee partying for flop movie Paisa VasoolComments

FOLLOW
 TOLLYWOOD