చిరంజీవి ఎన్టీఆర్ లు రిజెక్ట్ చేసిన పైసా వసూల్
TOLLYWOOD
 TOPSTORY

చిరంజీవి ఎన్టీఆర్ లు రిజెక్ట్ చేసిన పైసా వసూల్

Murali R | Published:September 3, 2017, 12:00 AM IST
మెగాస్టార్ చిరంజీవి , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు రిజెక్ట్ చేసిన కథ ని నందమూరి బాలకృష్ణ కు పది నిమిషాల్లో వినిపించి మాయచేసి పడేసాడు దర్శకులు పూరి జగన్నాధ్ దాంతో బాలయ్య ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బొక్కా బోర్లా పడ్డాడు . కానీ పైసా వసూల్ కథ , కథనం ఎంత దారుణంగా ఉందో చిరంజీవి , ఎన్టీఆర్ లు పసిగట్టేసారు అందుకే పూరి జగన్నాధ్ ని దూరం పెట్టేసారు . అసలు చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకులు '' ఆటో జానీ '' పేరుతో కథ చెప్పాడు కూడా . ఫస్టాఫ్ నచ్చింది సెకండాఫ్ చెత్తగా ఉంది అని పూరి ని పక్కన పెట్టారు .
 
 

కట్ చేస్తే ఎన్టీఆర్ కు టెంపర్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడని ఇదేకథ చెప్పాడు కానీ పరమ చెత్తగా అనిపించడంతో ఎన్టీఆర్ కూడా పూరి ని ఎంకరేజ్ చేయకుండా పక్కన పెట్టాడు . దాంతో స్వల్ప మార్పులు చేసి ఆటో ని కాస్త టాక్సీ ని చేసి బాలయ్య కు వినిపించాడు ఇంకేముంది క్యారెక్టరైజేషన్ బాగుందని బాలయ్య బుక్ అయిపోయాడు కట్ చేస్తే అతిపెద్ద డిజాస్టర్ ని అందుకున్నాడు . పూరి ని గుడ్డిగా నమ్మినందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు బాలయ్య . చిరంజీవి , ఎన్టీఆర్ లు రిజెక్ట్ చేసిన కథ చేసానని బాలయ్య కు తెలుసో లేదో !
Comments

FOLLOW
 TOLLYWOOD