పాకిస్థాన్ గెలిస్తే సంబరం చేసుకున్నారు
TOLLYWOOD
 TOPSTORY

పాకిస్థాన్ గెలిస్తే సంబరం చేసుకున్నారు

Murali R | Published:June 19, 2017, 12:00 AM IST
పాకిస్థాన్ గెలిస్తే సంబరం చేసుకున్నారు , కానీ ఆ సంబరం ఎక్కడ చేసుకున్నారో తెలుసా ......... ఇండియాలో అది కూడా హైదరాబాద్ లో . సంచలనం సృష్టిస్తున్న ఈ సంఘటన నిన్న హైదరాబాద్ లో జరిగింది . ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దాయాది పాకిస్థాన్ తో ఫైనల్ మ్యాచ్ లో తలపడింది భారత్ . అయితే ఏ దశలో కూడా భారత్ తన పట్టు చూపించలేక పోయింది కానీ పాకిస్థాన్ మాత్రం అన్ని విభాగాల్లో రాణించి సంచల విజయం సాధించింది.

మొదటి టాస్ గెలిచినప్పుడు బ్యాటింగ్ పాక్ కి అప్పగించడమే పెద్ద తప్పు , ఆ తప్పు చేసాడు కోహ్లీ . తొలుత బ్యాటింగ్ కి దిగిన పాక్ చెలరేగి భారత్ బౌలర్ల ని చీల్చి చెండాడారు . ఫలితంగా 50 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 338 పరుగులు చేసింది పాక్ . భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది . రోహిత్ శర్మ డకౌట్ కావడంతో భారత్ పతనం మొదలయ్యింది . దాయాది దేశంతో ఆడి ఘోరంగా ఓడిపోవడంతో హైదరాబాద్ లో పండగ చేసుకున్నారు, పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు . దాంతో ఆశ్చర్యపోవడం మిగతా జనాల వంతయ్యింది . భారత్ లో ఉంటూ పాక్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న వాళ్ళని ఏమనాలి.Comments

FOLLOW
 TOLLYWOOD