గంగూలీ పై దాడి చేసిన పాక్ అభిమానులు
TOLLYWOOD
 TOPSTORY

గంగూలీ పై దాడి చేసిన పాక్ అభిమానులు

Murali R | Published:June 17, 2017, 12:00 AM IST

సౌరవ్  గంగూలీ పై పాకిస్థాన్ అభిమానులు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది . ఈ సంచలన సంఘటన లండన్ లో జరిగింది . వివరాల్లోకి వెళితే ....... పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ లోకి అడుగు పెట్టడంతో పాకిస్థాన్ అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది . పాక్ గెలిచిందన్న ఆనందంలో ర్యాలీ గా వెళుతున్న సమయంలో సౌరవ్ గంగూలీ అదే దారిలో కారులో వెళుతున్నాడు.

అయితే సౌరవ్ ని చూసిన పాక్ అభిమానులు వెంటనే సౌరవ్ గంగూలీ కారు మీద దాడి చేయడమే కాకుండా గట్టిగా పాకిస్థాన్ జిందాబాద్ , ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ అల్లరి చేసారు . అయితే గంగూలీ మాత్రం వాళ్ళని రెచ్చగొట్ట కుండా చిరు నవ్వు నవ్వి కొద్దిసేపు కారు లోపలే ఉండిపోయి అలాగే రోడ్డు మీద కారు నిలిపి ఉంచాడు . పాక్ అభిమానులు పక్కకు తప్పుకున్నాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు . సున్నితమైన విషయం కావడంతో గంగూలీ సమయస్ఫూర్తి ప్రదర్శించాడు దాంతో పెద్ద ప్రమాదం తప్పింది . లేదంటే పరిస్థితి మరోలా ఉండేది.
Comments

FOLLOW
 TOLLYWOOD