పవన్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ యుద్ధం
TOLLYWOOD
 TOPSTORY

పవన్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ యుద్ధం

Murali R | Published:March 20, 2017, 12:00 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ ల మధ్య యుద్ధం మళ్ళీ మొదలయ్యింది . గతకొంత కాలంగా అల్లు అర్జున్ ని వెంటాడి మరీ విమర్శిస్తున్నారు పవన్ ఫ్యాన్స్ . అయితే మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది అని అనుకుంటే దువ్వాడ జగన్నాధం టీజర్ రావడంతో అది మళ్ళీ అంటుకుంది . అల్లు అర్జున్ టీజర్ ని ఎక్కువ సంఖ్యలో డిజ్ లైక్ చేసి పవన్ ఫ్యాన్స్ కక్ష్య తీర్చుకోవడంతో తాజాగా ఆ ఛాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు లభించింది కాటమ రాయుడుట్రైలర్ రూపంలో . పవన్ నటించిన కాటమ రాయుడు ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయిన విషయం తెలిసిందే . 
 
 

దాంతో బన్నీ ఫ్యాన్స్ కూడా పవన్ ని వెంటాడుతున్నారు . కాటమ రాయుడు ట్రైలర్ ని డిజ్ లైక్ చేస్తూ వాళ్ళు కూడా కోపాన్ని తీర్చుకుంటున్నారు . ఈ లొల్లి ఇప్పట్లో ఆగేలా లేదు . ఈ వ్యవహారం చూస్తుంటే ఇంకా పెరిగేలా ఉంది తప్ప ఆగేలా కనిపించడం లేదు . 
Comments

FOLLOW
 TOLLYWOOD