పవన్ కళ్యాణ్ తేల్చుకోలేకపోతున్నాడు
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ తేల్చుకోలేకపోతున్నాడు

Murali R | Published:August 11, 2017, 12:00 AM IST
నంద్యాల ఉప ఎన్నికలో జనసేన ఏ పార్టీ కి మద్దతు ఇవ్వాలో పవన్ తేల్చుకోలేక పోతున్నాడు .  నంద్యాల ఉప ఎన్నికలో బరిలో తెలుగుదేశం పార్టీ - ప్రతిపక్ష వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటా పోటీ గా తలపడుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ ఇద్దరిలో ఎవరికీ మద్దతు ఇవ్వనున్నాడో ఇంకా తెలియరాలేదు . నామినేషన్ల కు ముందు మాత్రం రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకొని ప్రకటిస్తానని చెప్పాడు కానీ రెండు రోజులు అన్నది ఇప్పుడు రెండు వారాలు అవుతోంది అయినప్పటికీ పవన్ నుండి ఎటువంటి ప్రకటన లేదు.

దాంతో పవన్ రాజకీయాల్లో రాణించలేడని , ఏదో ఒకటి తేల్చి పడెయ్యాలి కానీ ఇలా నాన్చుడు ధోరణి సరైన రాజకీయ లక్షణం కాదంటున్నారు విశ్లేషకులు . నంద్యాల ఉప ఎన్నికలు మహా సంగ్రామం లా జరుగుతున్నాయి ఈ దశలో పవన్ ఎవరికి మద్దతు ప్రకటిస్తే వాళ్లకు కాస్త మొగ్గు ఉంటుంది కాబట్టి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ పవన్ మద్దతు కోసం ఎదురు చూస్తోంది . మరి పవన్ ఎప్పుడు నిర్ణయాన్ని ప్రకటిస్తాడో చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD