మహేష్ ని అవమానిస్తున్న పవన్ ఫ్యాన్స్
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ ని అవమానిస్తున్న పవన్ ఫ్యాన్స్

Murali R | Published:August 10, 2016, 12:00 AM IST
తెలుగులో అభిమాన హీరో కోసం ఎంత కైనా సరే తెగించి పోరాడే వీరాభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే . అయితే ఈ వీరాభిమానం ఒక్కోసారి హద్దులు దాటి ఇతర హీరోలను కామెంట్ చేయడం వరకు వెళుతోంది . తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ బాబు పై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు . ఇక మహేష్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ? పవన్ ఫ్యాన్స్ పై విరుచుకు పడుతున్నారు . 
n
 
n
 
n
సోషల్ మీడియాలో ఇంతగా ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మద్య లొల్లి ముదరడానికి కారణం ఏంటో తెలుసా .............  ఇటీవల మహేష్ కు సైమా ఉత్తమ నటుడి అవార్డ్ వచ్చింది దాంతో ''బెస్ట్ యాక్టర్ ట్రోఫీ ఇచ్చినందుకు థాంక్స్ సైమా '' అని ట్వీట్ చేసాడు మహేష్ . ఆ ట్వీట్ ఇంత రాద్దంతానికి కారణం అయ్యింది . ట్రోఫీ అనే పదాన్ని క్రీడల్లో మాత్రమే వాడతారని కానీ మహేష్ అవార్డ్ విషయంలో వాడుతున్నాడని ఈమాత్రం కూడా మహేష్ కు తెలియదా అంటూ పవన్ ఫ్యాన్స్ మహేష్ ని అవమానిస్తున్నారు . Comments

FOLLOW
 TOLLYWOOD