చరణ్ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చిన పవన్
TOLLYWOOD
 TOPSTORY

చరణ్ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చిన పవన్

Murali R | Published:July 16, 2017, 12:00 AM IST

రాంచరణ్ తేజ్ తో రంగస్థలం 1985 చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీస్ అధినేతలు రవిశంకర్ , నవీన్ , మోహన్ లకు వార్నింగ్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్ . ఆ ముగ్గురు నిర్మాతలకు పవన్ వార్నింగ్ ఇచ్చింది నిజమే ! కానీ చరణ్ సినిమా విషయంలో కాదు సుమా ! చరణ్ తో రంగస్థలం సినిమా కంప్లీట్ అయ్యాక వెంటనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి వాళ్ళు అయితే చరణ్ రంగస్థలం 1985 చిత్రం డిసెంబర్ లో రిలీజ్ అనుకుంటున్నారు . 

 

అలాంటి సమయంలో వెంటనే పవన్ తో సినిమా అంటే సిద్ధంగా ఉంటారో లేదో అని వాళ్ళని పిలిచి గట్టిగా చెప్పాడట . ఎలాంటి పరిస్థితి అయినా సరే ఈ సంవత్సరం ఆఖరులో సినిమా ప్రారంభించాలి అలాగే 2018 వేసవిలో సినిమాని రిలీజ్ చేయాలి ఎందుకంటే ఆ తర్వాత జనసేన పార్టీ కోసం నా సమయం అంతా కాబట్టి ఇప్పుడే అలర్ట్ కండి . ప్లానింగ్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఇబ్బంది పడొద్దు , నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని ఖరాఖండి గా చెప్పాడట అదీ విషయం .
Comments

FOLLOW
 TOLLYWOOD