పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడా
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడా

Murali R | Published:August 16, 2017, 12:00 AM IST
ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నిక జరుగుతోంది , అక్కడ ప్రచారం హోరెత్తి పోతోంది . అధికార , ప్రతిపక్ష పార్టీ లు కొదమ సింహాల్లా తలపడుతున్నాయి . తీవ్ర స్థాయిలో ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు అయినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు . నామినేషన్ల సమయంలో మాత్రం రెండు రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తానని చెప్పాడు కానీ ఇంతవరకు దాని అతీగతీ లేదు .
 
 

ఒకవైపు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది కానీ పవన్ తన మద్దతు ఎవరికో ఇదమిద్దంగా తెలియజేయడం లేదు . తెలుగుదేశం పార్టీ కి గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చాడు పవన్ మరి ఇప్పుడు తెలుగుదేశానికి మద్దతు ఇస్తాడా ? లేక జగన్ పార్టీ కి ఇస్తాడా ? తెలియడం లేదు లేదంటే ఏ పార్టీ కి మద్దతు ఇవ్వకుండా తటస్థం గా ఉంటాడా చూడాలి .
Comments

FOLLOW
 TOLLYWOOD