పవన్ - కొరటాల శివల సినిమా బాక్స్ లు బద్దలేనట
TOLLYWOOD
 TOPSTORY

పవన్ - కొరటాల శివల సినిమా బాక్స్ లు బద్దలేనట

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

ఇప్పటికే మూడు బ్లాక్ బస్టర్ లతో సంచలనం సృష్టించిన దర్శకులు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని మళ్ళీ మహేష్ బాబు తో కలిసి చేయడానికి రెడీ అవుతున్నాడు కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేయడానికి సమాయత్తం అవుతున్నాడట కొరటాల శివ . సందేశాత్మక చిత్రాలను రూపొందించే కొరటాల పవన్ కళ్యాణ్ తో కనుక సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలు కొట్టే సినిమా రావడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు పవన్ ఫ్యాన్స్ . అలాగే ఈ ఇద్దరి కాంబినేషన్ లో త్వరగా సినిమా రావాలని ఆశపడుతున్నారు కూడా . ఇక పవన్ కూడా ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా సినిమాలు చేసి 2019 ఎన్నికల ప్రచారం పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు . ఆలోపున పవన్ - కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉంది . ఇక ఆ సినిమా వస్తే బాక్స్ లు బద్దలు కావడం ఖాయమే కదా!
Comments

FOLLOW
 TOLLYWOOD