అబ్బా ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు
TOLLYWOOD
 TOPSTORY

అబ్బా ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు

Murali R | Published:July 17, 2017, 12:00 AM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్నాడు . దాంతో అబ్బా ! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకెన్నాళ్లకు ఈ ఇద్దరి కలయిక అంటూ అందరూ ఆశ్చర్య పోతున్నారు . గత ఎన్నికల్లో బిజెపి తో కలిసి టిడిపి పోటీ చేయగా జనసేన మద్దతు ఇచ్చింది . ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పలు సమస్యలపై పవన్ గళమెత్తి చంద్రబాబు తో సమావేశమయ్యాడు.

కట్ చేస్తే ఇద్దరి మధ్య దూరం పెరిగింది , స్వరంలో కూడా తేడా వచ్చింది దాంతో ఒకదశలో తెలుగుదేశానికి పవన్ దూరమైనట్లే అని అనుకున్నారు . మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇన్నాళ్లకు మళ్ళీ చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్నాడు . స్పెషల్ స్టేటస్ విషయంలో బాబు తో విభేదించిన పవన్ ఈరోజు ఏం మాట్లాడతాడో అన్న చర్చ జరుగుతోంది.Comments

FOLLOW
 TOLLYWOOD