సమంత కు గిఫ్ట్ పంపించిన పవన్ కళ్యాణ్
TOLLYWOOD
 TOPSTORY

సమంత కు గిఫ్ట్ పంపించిన పవన్ కళ్యాణ్

Murali R | Published:October 12, 2017, 8:40 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమంత కు డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు . ఈనెల 6న సమంత - నాగచైతన్య ల వివాహం గోవాలో జరిగిన విషయం తెలిసిందే . కాగా ఆ పెళ్ళికి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు కానీ తనతో నటించిన హీరోయిన్ ఆపై ఫ్రెండ్ కూడా కాబట్టి డైమండ్ రింగ్స్ కానుకగా పంపించాడట . పవన్ కళ్యాణ్ తో పాటుగా దర్శకులు త్రివిక్రమ్ కూడా డైమండ్ రింగ్ పంపించాడట . అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ సరసన సమంత నటించగా ఆ చిత్రానికి దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్.

పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లు పంపించిన డైమండ్ రింగ్స్ చూసి చాలా థ్రిల్ ఫీలయ్యిందట సమంత . అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం లో అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్దతిలో రెండు రకాలుగా పెళ్లి చేసుకుంది సమంత . ఇక రేపు సమంత నటించిన రాజుగారి గది 2 సినిమా రిలీజ్ అవుతోంది . మరి ఆ సినిమా ఏమౌతుందో చూడాలి . పెళ్లయ్యాక రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి .Comments

FOLLOW
 TOLLYWOOD