పెద్దాయన కాళ్ళు మొక్కిన పవన్ కళ్యాణ్
TOLLYWOOD
 TOPSTORY

పెద్దాయన కాళ్ళు మొక్కిన పవన్ కళ్యాణ్

Murali R | Published:December 9, 2017, 8:51 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పెద్దాయన కాళ్ళు మొక్కి సంచలనం సృష్టించాడు , ఈ సంచలన సంఘటన అమరావతి లో జరిగింది . ఇంతకీ ఆ పెద్దాయన కు పవన్ ఎందుకు మొక్కాడో తెలుసా ...... .... జనసేన పార్టీ కార్యాలయం కోసం కొంతమంది రైతులు ముందుకు వచ్చి తమ భూములను ఇచ్చారు దాంతో వాళ్ళని సన్మానించాడు పవన్ అయితే వాళ్లలో ఓ పెద్దాయన కు మాత్రం పాదాభివందనం చేసాడు దాంతో ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . 

ఇటీవల పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన చేసిన విషయం తెలిసిందే . అందులో భాగంగానే అమరావతి కూడా వెళ్ళాడు . ఇకపై సినిమాల్లో నటించనని తన సమయం మొత్తం రాజకీయాలకే అంకితం అంటూ ప్రజల ముందుకు వచ్చాడు . అమరావతి లో జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు పవన్ అందుకోసం కొంతమంది రైతులు తమ భూములను ఇచ్చారు . జనసేన కేంద్ర కార్యాలయం పనులు అమరావతి లో ప్రారంభం అయ్యాయి , అయితే అధికారమే పరమావధి కాదు అంటూ కొత్త మెలిక పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఏంటో మరి .
Comments

FOLLOW
 TOLLYWOOD