పెళ్లి చూపులు డైరెక్టర్ ద్వితీయ విఘ్నం దాటుతాడా
TOLLYWOOD
 TOPSTORY

పెళ్లి చూపులు డైరెక్టర్ ద్వితీయ విఘ్నం దాటుతాడా

Murali R | Published:August 6, 2017, 12:00 AM IST
పెళ్లి చూపులు చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు . 2016 జూలై లో రిలీజ్ అయిన పెళ్లి చూపులు చిత్రం తర్వాత దాస్యం తరుణ్ భాస్కర్ పై భారీ అంచనాలు నెలకొనడం తో రెండో సినిమా చేయడానికి చాలాకాలం తీసుకున్నాడు . సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తరుణ్ రెండో సినిమా చేస్తున్నాడు . అంతా కొత్తవాళ్లు తో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు తరుణ్ భాస్కర్ .
 

ప్రస్తతం కొత్త నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు ఆ చిత్ర బృందం . ఎంటర్ టైన్మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ , కథనాల పట్ల నిర్మాత సురేష్ బాబు చాలా సంతృప్తిగా ఉన్నాడట . అయితే తెలుగులో కొంతమంది దర్శకులకు ద్వితీయ విఘ్నం ఉంది , మరి దాస్యం తరుణ్ భాస్కర్ ఆ ద్వితీయ విజ్ఞాన్ని దాటుతాడా ? లేదా ? చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD