పెళ్లి చూపులు డైరెక్టర్ సైన్మా
TOLLYWOOD
 TOPSTORY

పెళ్లి చూపులు డైరెక్టర్ సైన్మా

Murali R | Published:September 12, 2017, 12:00 AM IST
పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని మొత్తం  తిప్పుకున్న దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ . పెళ్లి చూపులు చిత్రం గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది అయితే ఆ సినిమా పూర్తయి ఏడాది పూర్తయినప్పటికీ ఇంకా మరో సినిమా ఏది సెట్స్ మీదకు వెళ్ళలేదు దాంతో అతడి నుండి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు . అయితే ఎట్టకేలకు అతడు ఓ శుభవార్త చెబుతున్నాడు .
 
 

కొత్తవాళ్లతో సైన్మా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . సైన్మా అనే షార్ట్ ఫిలిం తీసాడు డైరెక్టర్ గా పరిచయం కాకముందు ఆ షార్ట్ ఫిలిం అత్యధిక వ్యూస్ సాధించాయి దాంతో ఆ దాన్ని సినిమాగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దాస్యం తరుణ్ భాస్కర్ . ఈ సినిమాని సురేష్ బాబు బ్యానర్ లో చేయనున్నాడు , ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కావచ్చింది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది ఆ సినిమా . తెలుగులో చాలామంది దర్శకులకు ద్వితీయ విఘ్నం ఉంది మరి ఆ విఘ్నం ని దాస్యం తరుణ్ భాస్కర్ దాటుతాడా ? చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD